నీట్ ‘రీ-టెస్ట్’పై పీఎంవో నజర్
ABN , Publish Date - May 29 , 2026 | 05:25 AM
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జూన్ 21న జరగబోయే రీ-టెస్ట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా...
రంగంలోకి ప్రధాని మోదీ..!
స్వయంగా పర్యవేక్షణ
న్యూఢిల్లీ, మే 28: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జూన్ 21న జరగబోయే రీ-టెస్ట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు, ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. పేపర్ సెట్టింగ్. ప్రింటింగ్, రవాణా దశల నుంచి పరీక్షా కేంద్రాల్లో చివరి విద్యార్థి చేతికి ప్రశ్నపత్రం అందేవరకు ప్రతి ఒక్క ప్రక్రియను పీఎం వో అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. ఢిల్లీలోని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసంలో బుధవారం జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమీక్షలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాధిత్య సింధియా, ఎన్‌టీఏ డైరెక్టర్ అభిషేక్ సింగ్, పీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రశ్నపత్రాలను సురక్షితంగా రవాణా చే యడానికి అవసరమైతే వాయుసేన సహాయం తీసుకునే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై ఎలాంటి తుది నిర్ణ యం తీసుకోలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలిస్తున్నారని, ప్రతి చిన్న అప్‌డేట్‌ను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారని తెలిపాయి. దేశవ్యాప్తంగా సుమారు 23లక్షల మంది విద్యార్థులు సన్నద్ధం అవుతున్న తరుణంలో.. ఎలాంటి పొరపాటుకు తావులేకుండా ఉండేందుకే పీఎంవో నేరుగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News