Share News

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:40 PM

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు. నీట్ పేపర్ లీక్‌పై నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన ఆయనకు టైఫాయిడ్ వచ్చింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా దీప్కే వెల్లడించారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..
Abhijeet Deepke

ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు. నీట్ పేపర్ లీక్‌పై నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన ఆయనకు టైఫాయిడ్ వచ్చింది. తనకు టైఫాయిడ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా అభిజీత్ దీప్కే వెల్లడించారు. తనకు టైఫాయిడ్ వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల వైద్య పరీక్షలు చేయించగా వ్యాధి నిర్ధారణ అయినట్లు చెప్పారు.


ప్రస్తుతం రోజుకు రెండుసార్లు ఇంట్రావీనస్ (IV) చికిత్స తీసుకుంటున్నట్లు దీప్కే పేర్కొన్నారు. తాను అనారోగ్యానికి గురైనా విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరుతూ చేపట్టిన నిరసన దీక్ష మాత్రం కొనసాగుతుందని చెప్పారు. అలాగే, నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని అభిజీత్ తన వీడియో సందేశంలో తేల్చి చెప్పారు. మరోవైపు, దీప్కేతో పాటు పలువురు సీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.


వీడియోలో ఏముందంటే..?

'అందరికీ నమస్కారం. కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదని మీ అందరికీ తెలుసు. అందుకే రక్త పరీక్షలు చేయించాను. రిపోర్టుల్లో టైఫాయిడ్ అని నిర్ధారణ అయింది. చికిత్స కొనసాగుతోంది. నాకు ప్రతి ఉదయం, సాయంత్రం ఐవీ డ్రిప్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బొద్దింకలందరికీ నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. మీ వల్లే ఈ ఉద్యమం ఇంత విజయవంతమైంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఉద్యమాన్ని ఇంత పెద్ద విజయంగా మార్చినందుకు మీ అందరికీ అభినందనలు. నీట్ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ చేపట్టిన ఉద్యమం కొనసాగుతుంది' అని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

‘భయపడినవాడు ముందుకు సాగలేడు‘.. సల్మాన్ పోస్టు వైరల్..

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డీప్‌ఫేక్ వీడియోపై కేసు నమోదు..

Updated Date - Jul 25 , 2026 | 01:37 PM