Share News

కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:55 AM

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కర్ణాటకలో అఽధికార కాంగ్రె్‌సకుషాక్‌ ఇచ్చాయి.

కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్
congress logo

కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్

న్యూఢిల్లీ/బెంగళూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కర్ణాటకలో అఽధికార కాంగ్రె్‌సకుషాక్‌ ఇచ్చాయి. ఇక్కడ రెండు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఎన్డీయే కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. బీజేపీ 3, జేడీ(ఎస్‌) ఒక సీటు గెలుచుకున్నాయి. అధికార కాంగ్రెస్‌ ఇక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది. కర్ణాటకతో పాటు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్రల్లో మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బుధవారంకౌంటింగ్‌ ప్రారంభించగా.. పలు స్థానాలకు ఇంకా కొనసాగుతోంది. యూపీలో మొత్తం 11 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఆరు సీట్లను గెలుచుకోగా, ఎస్పీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎస్పీ అభ్యర్థి లాల్‌ బిహారీ యాదవ్‌ తన సమీప బీజేపీ అభ్యర్థిపై 4,900 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇటు బిహార్‌లో మొత్తం 8 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యంలోని జన్‌ సురాజ్‌ పార్టీ (జేఎస్పీ) ఒక సీటు (దర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) ను గెలుచుకుంది. అధికార ఎన్డీయే కూటమి 4 సీట్లు, ఇండిపెండెంట్లు 2 సీట్లు, ఆర్జేడీకి 1, జేఎస్పీ ఒక స్థానంలో గెలుపొందాయి. మరోవైపు.. మహారాష్ట్రలో అధికార-ప్రతిపక్ష కూటముల మధ్య గట్టి పోటీ కొనసాగింది. మొత్తం 5 సీట్లలో అధికార మహాయుతి కూటమి రెండు చోట్ల గెలిచింది. మరో చోట ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ రెండు చోట్ల ముందంజలో ఉంది.


బ్యాలెట్‌తో జరిగిన ఎన్నికలే కదా.. మరి ఏమైంది: మోదీ

నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌ పత్రాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ కాంగ్రెస్‌ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయిందంటూ ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘నాలుగు పెద్ద రాష్ట్రాలైన యూపీ, బిహార్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లోని 28 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అది కూడా బ్యాలెట్‌ పత్రాలతోనే.. అయితే కాంగ్రెస్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుందో ఊహించండి..?’ అంటూ ఆయన ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేస్తూ ప్రశ్నించారు. అయితే దీనికి కాంగ్రెస్‌ దీటుగానే బదులిచ్చింది. ఎన్నికల ఫలితాలపై ఈవీంఎంల ప్రభావం ఉండబోదని ప్రధాని భావిస్తే.. ఇకపై లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నిలకను బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Updated Date - Oct 29 , 2026 | 06:28 AM