ఎన్సీపీలో ‘షా’ కలకలం..పార్టీ సీనియర్లతో భేటీ
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:52 AM
తమ పార్టీ అధ్యక్షురాలు, ఉప ముఖ్యమంత్రి సునేత్రాపవార్, ఆమె కుమారుడు పార్థ్ పవార్ లేకుండానే ఎన్సీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ మళ్లీ చర్చనీయాంశమైంది
ముంబై/పుణె, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ అధ్యక్షురాలు, ఉప ముఖ్యమంత్రి సునేత్రాపవార్, ఆమె కుమారుడు పార్థ్ పవార్ లేకుండానే ఎన్సీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ మళ్లీ చర్చనీయాంశమైంది. ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, దిలీప్ వల్సే పాటిల్ ఈ భేటీలో పాల్గొన్నారు. సమీర్ భుజ్‌బల్ కూడా వారి వెంట ఉన్నారు. ఎన్సీపీ ఇరు వర్గాలను ఏకం చేసి ఎన్డీయేలోకి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకు రెండు కేంద్రమంత్రి పదవులు ఇవ్వజూపిందని ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి.గత వారం షాను కలిసిన సునేత్ర, పార్థ్.. విలీన పార్టీ తరఫున ఎన్డీయేలో పార్థ్‌నే కీలక బాధ్యుడిగా ఉంచాలని ప్రతిపాదించారని, కానీ శరద్‌వర్గం అందుకు అంగీకరించదని కథనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, సునేత్ర, పార్థ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తాజాగా షాను కలిసిన నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి