Share News

నేడు దేశవ్యాప్తంగా సామూహిక నిరాహారదీక్ష

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:19 AM

నీట్‌-2026 పరీక్షల్లో అవకతవలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 18వ రోజుకు..

నేడు దేశవ్యాప్తంగా సామూహిక నిరాహారదీక్ష

వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా సీజేపీ నేత అభిజీత్‌ దీప్కే పిలుపు

  • 18వ రోజుకు చేరిన సోనమ్‌ దీక్ష

న్యూఢిల్లీ, జూలై 15: నీట్‌-2026 పరీక్షల్లో అవకతవలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం 18వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మండిపడ్డారుు. వాంగ్‌చుక్‌ ఉద్యమానికి సంఘీభావంగా గురువారం(16న) దేశవ్యాప్తంగా నిర్వహించే సామూహిక నిరాహార దీక్షలో పాలుపంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ తమ ప్రొఫైల్‌ ఫొటో మార్చుకోవాలని కోరారు. వాంగ్‌చుక్‌ ఇప్పటికే 8.9 కిలోల బరువు తగ్గారు. వాంగ్‌చుక్‌ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఆయనతో చర్చించే దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ తేజాస్‌ కరియాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణకు చేపట్టగా.. ప్రభుత్వం తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు.

మీ గళం దేశానికి అవసరం: శశిథరూర్‌

పర్యావరణ వేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమించాలని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ కోరారు. ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ లేఖ రాశారు. ‘‘శ్రీ సోనమ్‌ వాంగ్‌చుక్‌ జీ.. దీక్ష విరమించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. జాతి అంతరాత్మను మేల్కొలిపారు. నిరాహార దీక్ష అసలు ఉద్దేశ్యం కూడా అదే. ఈ దేశానికి మీ గళం సుదీర్ఘకాలం పాటు అవసరం’’అని లేఖలో శశిథరూర్‌ పేర్కొన్నారు.

వాంగ్‌చుక్‌ అద్భుతమైన వ్యక్తి

విద్యారంగంలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేస్తున్న ప్రయోగాల స్ఫూర్తితో రూపొందించిన 2009 నాటి సినిమా ‘త్రీ ఇడియట్స్‌’లో చతుర్‌ రామలింగం పాత్రను పోషించిన భారతీయ అమెరికన్‌ నటుడు ఓమి వైద్య.. వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహారదీక్షకు మద్దతు ప్రకటించారు. వాంగ్‌చుక్‌ వంటి గొప్ప వ్యక్తి మరణించకూడదంటూ ఉద్వేగపూరితంగా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘త్రీ ఇడియట్స్‌లో అమీర్‌ఖాన్‌ పోషించిన ఫున్‌సుక్‌ వాంగ్డూ పాత్ర వాంగ్‌చుక్‌ స్ఫూర్తితో రూపొందినదే. ఆయన ఆమరణ దీక్షలో ఉన్నారు. దీని గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. భారతదేశంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాల మీద వాంగ్‌చుక్‌ దీక్ష చేస్తున్నారు. అది చాలా ముఖ్యమైన విషయం. మీరు వాంగ్‌చుక్‌తో అంగీకరించినా అంగీకరించకపోయినా.. ఆయన మరణించవద్దని నేను కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 06:53 AM