Share News

నల్సార్‌ విద్యార్థులకు బీసీఐ చైర్మన్‌ క్షమాపణ

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:29 AM

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ న్యాయ విద్యార్థుల పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) చైర్మన్‌ మనన్‌కుమార్‌ మిశ్రా విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్‌కు...

నల్సార్‌ విద్యార్థులకు బీసీఐ చైర్మన్‌ క్షమాపణ

విద్యార్థుల డిమాండ్‌కు తలవంచిన మనన్‌కుమార్‌

తన వ్యాఖ్యలు, ఆదేశాలపై విచారం

న్యూఢిల్లీ, ఆగస్టు 15: హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ న్యాయ విద్యార్థుల పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) చైర్మన్‌ మనన్‌కుమార్‌ మిశ్రా విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్‌కు తలవొంచి శనివారం ఆయన క్షమాపణలు వేడుకున్నారు. ‘‘ప్రస్తుత వివాదానికి సంబంధించి, నేను చేసిన వ్యాఖ్యలు లేదా నా లేఖ ఏదైనా న్యాయ విద్యార్థుల అభిప్రాయాలను గాయపరిచి ఉంటే.. అందుకు విచారం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెబుతున్నాను. విచారం వ్యక్తం చేయడం ప్రతిష్ఠ లేదా అహానికి సంబంధించినది కానేకాదు. మన విద్యార్థుల అభిప్రాయాలు, అభ్యంతరాలను మన్నించడమే’’ అని మనన్‌కుమార్‌ మిశ్రా ప్రకటించారు. అంతకుముందు తమపై చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చిన మనన్‌కుమార్‌ మిశ్రా క్షమాపణలు చెప్పాలని నల్సార్‌ న్యాయ విద్యార్థుల సంఘం డిమాండ్‌ చేసింది. నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ను పిలవడాన్ని విద్యార్థులు వ్యతిరేకించడం తెలిసిందే. ఈ పరిణామం అనంతరం నల్సార్‌ 2026 న్యాయశాస్త్ర పట్టభద్రులను అడ్వొకేట్లుగా నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్‌కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేయడం ఈ వివాదానికి దారితీసింది. ఈ ఆదేశాలను చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ కూడా తప్పుబట్టారు.

ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 06:29 AM