తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య.. రేపు అసెంబ్లీ తొలి సమావేశం
ABN , Publish Date - May 10 , 2026 | 06:19 PM
తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా తమిళగ వెట్రికళగం (టీవీకే) నేత ఎంవీ కరుప్పయ్య ఎన్నికయ్యారు. ఆయన చేత ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆదివారంనాడు ప్రమాణస్వీకారం చేయించారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా తమిళగ వెట్రికళగం (టీవీకే) నేత ఎంవీ కరుప్పయ్య ఎన్నికయ్యారు. ఆయన చేత ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆదివారంనాడు ప్రమాణస్వీకారం చేయించారు.
11న అసెంబ్లీ తొలి సమావేశం
కాగా, తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం మే 11వ తేదీ ఉదయం 9.30 గంటలకు లిజిస్లేటివ్ అసెంబ్లీ ఛాంబర్‌లో జరుగుతుందని అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కరుప్పయ్య ప్రమాణస్వీకారం చేయిస్తారు. 12వ తేదీ ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
తిరుచురాపల్లి ఈస్ట్ సీటుకు విజయ్ రాజీనామా
కేరళ ముఖ్యమంత్రి పదవి.. ఆయన వైపే రాహుల్ గాంధీ మొగ్గు..