Share News

ముంబైని వణికిస్తున్న వర్షాలు.. చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి..

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:01 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమైంది. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

ముంబైని వణికిస్తున్న వర్షాలు.. చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి..
Mumbai heavy rains

దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమైంది. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంకా వర్షం కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచన చేసింది (Mumbai Heavy Rains).


ముంబైలో కురుస్తున్న ఈ భారీ వర్షాలు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కుర్లా ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో 63 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. థానె, పాల్ఘర్, నవీ ముంబై, పుణె ప్రాంతాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి (Maharashtra Rain News).


కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భద్రతా కాన్వాయ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది (Mumbai Weather). ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఓ భారీ వృక్షం కాన్వాయ్ ఎదుట కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు వెంటనే అప్రమత్తమై చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు: ఇరాన్


సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..

Updated Date - Jul 05 , 2026 | 05:45 PM