Share News

ముంబై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

ABN , Publish Date - Aug 19 , 2026 | 09:09 PM

నవా షెవా పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. DRI అధికారులు చేపట్టిన తనిఖీల్లో 56 కిలోల మెథాంఫేటమిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొక్కజొన్న సంచుల్లో దాచి సౌదీ అరేబియాకు తరలించేందుకు ప్రయత్నించగా.. 351 సంచులను తనిఖీ చేసి డ్రగ్స్‌ను గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

ముంబై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..
Mumbai Port Drug Seizure

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ నుంచి సౌదీ అరేబియాకు సుమారు 56 కిలోల మెథాంఫేటమిన్‌ను అక్రమంగా ఎగుమతి చేసే ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భగ్నం చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు.. నవా షెవా పోర్టులోని ఓ ఎగుమతి సరుకును తనిఖీ చేయగా పొడి రూపంలో ఉన్న నిషేధిత మెథాంఫేటమిన్‌ను గుర్తించారు. మొత్తం 351 సంచులతో కూడిన సరుకులో ఒక సంచిలో మొక్కజొన్నతో కలిపి భారీ మొత్తంలో డ్రగ్‌ను దాచినట్లు అధికారులు గుర్తించారు.


తనిఖీలను తప్పించుకునేందుకు పక్కా ప్లాన్..

మెథాంఫేటమిన్‌ను మొక్కజొన్నతో కలిపి.. మొత్తం సరుకును సాధారణ వ్యవసాయ ఉత్పత్తిగా చూపించేలా నిందితులు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు DRI తెలిపింది. ఎగుమతి సమయంలో జరిగే సాధారణ తనిఖీలు, డ్రగ్స్ గుర్తింపు ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకే ఈ విధానాన్ని అనుసరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సరుకు ఎగుమతి వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌ వివరాలపై DRI దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ అక్రమ రవాణాలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు.


Also Read:

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

Updated Date - Aug 19 , 2026 | 09:22 PM