ముంబైలో వర్షబీభత్సం
ABN , Publish Date - Jul 07 , 2026 | 06:47 AM
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ వేఖండాలా సమీపంలోని ‘మిస్సింగ్ లింక్’ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడటంతో...
ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌లోనూ వానలు
న్యూఢిల్లీ, జూలై 6: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ వేఖండాలా సమీపంలోని ‘మిస్సింగ్ లింక్’ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడటంతో ముంబై వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. భారీ వర్షాలకు పలు రైల్వే ట్రాకులు జలమయం కావడంతో 40పైగా సర్వీసులపై ఆ ప్రభావం పడింది. పూణేలోని మావల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఎడతెరిపి లేని వానలతో ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. వర్షాల వల్ల సోమవారం ముంబై సహా దేశవ్యాప్తంగా 14మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో 40 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు, ఛత్తీ్‌సగఢ్‌లో వరుసగా మూడోరోజు కూడా భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో నడుములోతు నీరు చేరడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోగా, నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ , హిమచల్‌ప్రదేశ్‌లలో కురిసిన భారీ వర్షాలు ఆయా రాష్ట్రాలను వణికించాయి. వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా, ఆకస్మిక వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు మూతపడ్డాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలలో వరుసగా మూడోరోజు కూడా కుండపోత వానలు కురిశాయి. ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, జూలై 7వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద ్దని హెచ్చరించింది. మరోవైపు, రాజస్థాన్, ఢిల్లీలలో వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. రాబోయే కొద్ది రోజుల పాటు పశ్చిమ, మధ్య, ఉత్తర భారత దేశంలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News