ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Apr 09 , 2026 | 08:35 PM
ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం టెర్మినల్ 1 బిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
ముంబై, ఏప్రిల్ 9: ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం టెర్మినల్ 1 బిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయ టెర్మినల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. అగ్నిమాకప దళానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొద్దిసేపటికే అగ్నిమాకప సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని గంటల కొద్ది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ముంబై అగ్నిమాపక దళం ముఖ్య అధికారి రవీంద్ర అంబుల్గేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. టెర్మినల్ లోపల ఉన్న కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సులలో మంటలు చెలరేగాయి. అంతేకాకుండా, ఈ అగ్నిప్రమాదం టెర్మినల్ గ్రౌండ్ ఫ్లోర్‌కే పరిమితమైనట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే, ముంబై అగ్నిమాపక దళం మంటలను కంట్రోల్ చేశారు. అయితే, మంటలు చెలరేగడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
ఈ వార్తలు కూడా చదవండి
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స