మోదీజీ.. మీరు కొంచెం మారారు!
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:01 AM
రాజకీయంగా నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే అధికార, విపక్ష నేతలు సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. విభేదాలు పక్కనపెట్టి హాయిగా పలకరించుకున్నారు...
ప్రధానితో ఖర్గే సరదా వ్యాఖ్య..నవ్వుతూ భుజం తట్టిన మోదీ
సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్‌లో అరుదైన దృశ్యం
న్యూఢిల్లీ, ఆగస్టు 12: రాజకీయంగా నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే అధికార, విపక్ష నేతలు సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. విభేదాలు పక్కనపెట్టి హాయిగా పలకరించుకున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేలు చమత్కరించుకున్న దృశ్యం ఎన్సీపీ నేత సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్‌లో కనిపించింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. ఢిల్లీలో జరిగిన ఈ రిసెప్షన్‌కు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ప్రియాంకను పలకరించారు. ‘ప్రియాంకా జీ ఎలా ఉన్నారు?’ అని అడిగారు. ‘నేను బాగున్నాను’ అని బదులిచ్చిన ఆమె.. ‘మీరెలా ఉన్నారు?’ అని ప్రధానిని అడిగారు. ‘నేను అలాగే ఉన్నాను’ అని మోదీ నవ్వుతూ జవాబిచ్చారు. అక్కడే ఉన్న ఖర్గే కల్పించుకొని ‘‘అలా ఏమీ లేదు.. మీరు కొంచెం మారిపోయారు’’ అంటూ చమత్కరించారు. దీంతో మోదీ నవ్వుతూ ఖర్గే భుజంపై తట్టారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఈ నెల 19న సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు విద్యార్థుల సమస్యలు, అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఈ సమావేశంలో వ్యూహాలు రూపొందిస్తారు.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News