Share News

కేంద్ర క్యాబినెట్‌ ప్రక్షాళన?

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:38 AM

ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన ముగించుకొని శనివారం రాత్రి స్వదేశానికి చేరుకోవటంతో ప్రభుత్వంలో, అధికార బీజేపీలో మార్పులపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి...

కేంద్ర క్యాబినెట్‌ ప్రక్షాళన?

  • మంత్రుల రాజీనామాలు కోరే అవకాశం

న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన ముగించుకొని శనివారం రాత్రి స్వదేశానికి చేరుకోవటంతో ప్రభుత్వంలో, అధికార బీజేపీలో మార్పులపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అయోధ్యలో విరాళాల చోరీ, ఈ20 పెట్రోల్‌పై వివాదం, నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ఽధర్మేంద్రప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. కేంద్ర మంత్రులందరి నుంచి రాజీనామాలు తీసుకుని, వారిలో తాను కోరుకున్నవారిని కొనసాగిస్తారని.. మిగతావారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, హర్దీ్‌పసింగ్‌ పురి, భూపేంద్ర యాదవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరులను పదవుల నుంచి తప్పించవచ్చని, దాదాపు అందరి శాఖలు మారతాయని చర్చ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఉప ప్రధానిగా ప్రకటించి, ఆయనే తన వారసుడని మోదీ సంకేతాలిచ్చేందుకు కూడా వెనుకాడకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది మంత్రులు తమ శాఖల్లోని పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరిస్తున్నారని, కొద్ది మందికి మాత్రం కీలక నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు అందాయని తెలిసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 05:38 AM