Share News

ఇన్నోవాలు కావాలని బీఎంసీ ప్రతిపాదన.. బొమ్మ కార్లు పంపిన రాజ్ ఠాక్రే పార్టీ..

ABN , Publish Date - Aug 03 , 2026 | 05:47 PM

బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వాహనాల మార్పు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఖరీదైన ఇన్నోవా క్రిస్టా కార్లను కొనుగోలు చేయాలని బీఎంసీ అధికారులు చేసిన ప్రతిపాదనపై రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వ్యంగ్యంగా స్పందించింది.

ఇన్నోవాలు కావాలని బీఎంసీ ప్రతిపాదన.. బొమ్మ కార్లు పంపిన రాజ్ ఠాక్రే పార్టీ..
BMC Toy Innovas

బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారుల వాహనాల మార్పు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఖరీదైన ఇన్నోవా క్రిస్టా కార్లను కొనుగోలు చేయాలని బీఎంసీ అధికారులు చేసిన ప్రతిపాదనపై రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) వ్యంగ్యంగా స్పందించింది. బీఎంసీ కార్యాలయానికి బొమ్మ ఇన్నోవా కార్లను పంపించింది. అయితే భద్రతా సిబ్బంది ఆ బొమ్మ కార్లను కార్యాలయ ప్రాంగణంలోకి అనుమతించకుండా తిరిగి పంపించారు (BMC Toy Innova cars).


కొద్ది నెలల క్రితమే బీఎంసీ అధికారులు స్కార్పియో కార్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. అయితే వాటిలో ప్రయాణం వల్ల వెన్నునొప్పి వస్తోందని, సౌకర్యవంతంగా లేవని కొందరు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇన్నోవా క్రిస్టా కార్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో ఇన్నోవా క్రిస్టా కారు ధర సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుంది. ఈ నిర్ణయం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది (MNS Raj Thackeray).


ఈ నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ ఎంఎన్‌ఎస్‌ నేత సందీప్ దేశ్‌పాండే బీఎంసీకి బొమ్మ ఇన్నోవా కార్లను పంపించారు (Mumbai Civic Body). ప్రజల డబ్బుతో విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. మరోవైపు, బీఎంసీ మేయర్ రీతూ తావ్డే మాత్రం ఈ ప్రతిపాదనను సమర్థించారు. ప్రస్తుత ఒప్పందం ప్రకారం, అవసరమైతే వాహనాలను మార్చుకునే అవకాశం ఉందని, వెన్నునొప్పి సమస్య కారణంగానే ఈ మార్పు ప్రతిపాదన వచ్చిందని ఆమె తెలిపారు.


ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ


బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 03 , 2026 | 05:51 PM