Share News

మొహాన్ని చిదిమేసి.. ఇనుప రాడ్డు చొప్పించి.. అస్సాంలో 15 ఏళ్ల బాలికపై అమానవీయ దాడి..

ABN , Publish Date - Aug 03 , 2026 | 04:29 PM

అస్సాంలోని హైలాకండి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక అత్యంత ఘోరమైన స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

మొహాన్ని చిదిమేసి.. ఇనుప రాడ్డు చొప్పించి.. అస్సాంలో 15 ఏళ్ల బాలికపై అమానవీయ దాడి..
Assam 15 year old girl killing

అస్సాంలోని హైలాకండి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక అత్యంత ఘోరమైన స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు సమీపంలోని బంధువుల ఇంట్లో జరిగిన విందుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి బాలిక ఇంట్లో మృతదేహంగా కనిపించింది. ఈ కేసులో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది (Assam 15 year old girl killing).


హైలాకండి జిల్లాకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లింది. అయితే ఆ ఫంక్షన్‌లో కజిన్‌తో జరిగిన గొడవ కారణంగా ఇంటికి తిరిగి వచ్చేసింది. కాసేపటి తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చారు. తలుపులు తీసి చూసే సరికి ఆ బాలిక విగతజీవిగా పడి ఉంది. ఆ బాలిక తల, మొహం గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఆమె వ్యక్తిగత అవయవాల్లోకి ఇనుప రాడ్డును చొప్పించి పాశవికంగా హత్య చేశారు (Hailakandi girl brutal killing).


బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి (Assam crime news). అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. ఘటనకు సంబంధించిన వాస్తవాలు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే స్పష్టమవుతాయని హైలాకండి జిల్లా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ


బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 03 , 2026 | 05:35 PM