హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‘క్లౌడ్ రీజియన్’
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:24 AM
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించింది. దేశంలో ఇప్పటికే పుణె, చెన్నై, ముంబైలో...
దేశంలో నాలుగోది.. ‘ఇండియా సౌత్ సెంట్రల్’ పేరుతో సేవలు
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించింది. దేశంలో ఇప్పటికే పుణె, చెన్నై, ముంబైలో మూడు క్లౌడ్ రీజియన్‌లు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో నాలుగో రీజియన్‌ను ప్రారంభించినట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ వెల్లడించారు. ఇండియా సౌత్ సెంట్రల్ పేరుతో ప్రారంభించిన ఈ రీజియన్ గురువారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ రీజియన్‌తో దేశంలో అందుతున్న అత్యధిక హైపర్‌స్కేల్ క్లౌడ్ సేవలు తమవేనని చెప్పారు. హైదరాబాద్ రీజియన్‌లో మూడు అవైలబిలిటీ జోన్లు ఉన్నాయని.. ఇక్కడ నీటి వినియోగంలేని కూలింగ్ సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News