చెన్నై ఆయిల్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. బ్యారెళ్లన్నీ వరుసగా పేలడంతో..
ABN , Publish Date - May 25 , 2026 | 07:23 PM
తమిళనాడు రాజధాని చెన్నై పరిధిలోని మణలి ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
చెన్నై, మే 25: తమిళనాడు రాజధాని చెన్నై పరిధిలోని మణలి ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లక్ష్మీనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆయిల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో భారీగా నిల్వ ఉంచిన ఆయిల్ బ్యారెళ్లు వరుసగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గోదాంలో దాదాపు లక్ష లీటర్ల ముడి చమురు (క్రూడ్ ఆయిల్) నిల్వ ఉన్నట్లు సమాచారం. మంటల తీవ్రతకు ఆయిల్ బ్యారెళ్లు పెద్ద శబ్దాలతో పేలుతూ, దాదాపు 60 అడుగుల ఎత్తు వరకు పైకి ఎగిరిపడ్డాయి. ప్రమాద స్థలం నుంచి దట్టమైన నల్లటి పొగ మైళ్ల దూరం వరకు వ్యాపించడంతో మణలి, దాని పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే మణలి, ఎన్నూర్, మాధవరం ప్రాంతాల నుంచి భారీగా ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. అయితే, ఆయిల్ బ్యారెళ్లు నిరంతరాయంగా పేలుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆరు గంటలుగా సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సాధారణ నీటితో ఆయిల్ మంటలు అదుపు కాకపోవడంతో, రసాయన నురుగు కలిపిన నీటిని ఉపయోగించి మంటలను అణచివేసేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి.
ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే నివాస ప్రాంతాలకు సమీపంలో ఇలాంటి ప్రమాదకరమైన ఆయిల్ గోదాంలను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రమాద స్థలంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే నివాస ప్రాంతాలకు సమీపంలో ఇలాంటి ప్రమాదకరమైన ఆయిల్ గోదాంలను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్