Share News

మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య!

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:30 AM

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ(28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బీర్భూమ్‌ జిల్లాలోని రాంపూర్‌హట్‌లోని తమ నివాసంలో మంగళవారం ఉరి వేసుకున్నారు.

మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య!

కోల్‌కతా, సెప్టెంబరు 1: పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ(28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బీర్భూమ్‌ జిల్లాలోని రాంపూర్‌హట్‌లోని తమ నివాసంలో మంగళవారం ఉరి వేసుకున్నారు. కొన్నేళ్లుగా ఆమె డిప్రెషన్‌తో బాధ పడుతూ, దానికి చికిత్స కూడా పొందుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ పుట్టింట్లోనే నివసిస్తున్నారని.. తనకు, భర్తకు మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో విచారణ దశలో ఉందని పేర్కొన్నారు. బెంగాల్‌ను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో బ్రిస్టీ అక్రమంగా ఉద్యోగం పొందారనే ఆరోపణలు వచ్చాయి. నియామకాల్లో అవకతవకల కారణంగా కోర్టు ఆదేశాల మేరకు రద్దయిన ఉద్యోగాల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 06:32 AM