మహారాష్ట్రలో క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ రావాల్సిందే
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:33 AM
మహారాష్ట్రలో వాణిజ్య ప్యాసింజర్ వాహనాలు నడిపే డ్రైవర్లకు మరాఠీ భాష పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది....
ముంబై, ఆగస్టు 12: మహారాష్ట్రలో వాణిజ్య ప్యాసింజర్ వాహనాలు నడిపే డ్రైవర్లకు మరాఠీ భాష పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర మోటర్ వాహనాల (సవరణ) చట్టం- 2026 ప్రకారం.. ప్యాసింజర్ వాహనాలు తోలే డ్రైవర్లకు మరాఠీ మాట్లాడటం రావడాన్ని ప్రాథమిక అర్హతగా మార్చారు. మరాఠీ రాని డ్రైవర్ల లైసెన్సులను మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం గానీ, లేదా పూర్తిగా రద్దు చేయడం గానీ చేస్తారు. ప్రయాణికులతో సరిగా మాట్లాడలేక ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News