Share News

అవినీతికి న్యాయవ్యవస్థ అతీతం కాదు

ABN , Publish Date - May 28 , 2026 | 05:47 AM

న్యాయవ్యవస్థలో అవినీతికి తావులేదని ఎవరూ చెప్పలేరని, ఈ వ్యవస్థలోనూ అవినీతిపరులైన న్యాయమూర్తులు గతంలోనూ, ఇప్పుడూ కూడా ఉన్నారని...

అవినీతికి న్యాయవ్యవస్థ అతీతం కాదు

  • మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్య

చెన్నై, మే 27 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థలో అవినీతికి తావులేదని ఎవరూ చెప్పలేరని, ఈ వ్యవస్థలోనూ అవినీతిపరులైన న్యాయమూర్తులు గతంలోనూ, ఇప్పుడూ కూడా ఉన్నారని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల విడుదలైన తమిళ సినిమా ‘కరుప్పు’లో న్యాయవ్యవస్థను కళంకపరిచేలా సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌, జస్టిస్‌ వి.లక్ష్మీనారాయణన్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు విమర్శలకు అతీతులు కారని, న్యాయమూర్తులను పరమ పవిత్రులుగా భావించాల్సిన అవసరం లేదని అన్నారు. న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఉదంతాలు కూడా తమకు ఎదురయ్యాయని, వాటిని దాటుకునే వచ్చామని, వీలయినంత వరకూ మద్రాసు హైకోర్టు అలాంటి అవినీతి పరులను బయటకు పంపుతూనే ఉందని పేర్కొన్నారు. సినిమాలో చూపించింది కల్పిత న్యాయస్థానమని, కల్పిత న్యాయస్థానంలో అవినీతి జరిగిందని చూపినపుడు దానిని 1971 నాటి కోర్టు ధిక్కరణ చట్టంలోని నిబంధనల ప్రకారం శిక్షించలేమని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:47 AM