దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాల్సిందే: మందకృష్ణ
ABN , Publish Date - May 28 , 2026 | 05:32 AM
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు...
న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి కేంద్రం నియమించిన ప్రత్యేక కమిటీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌తో బుధవారం ఆయన భేటీ అయ్యారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ఓ నివేదికను సమర్పించారు. 200కు పైగా పేజీలతో కూడిన ఆ నివేదికలో దళిత క్రైస్తవులకు సంబంధించిన విద్య, వైద్య, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను పేర్కొంటూ వారికి ఎస్సీ హోదా, రాజ్యాంగ హక్కులను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News