Share News

‘లుంగీవాలా’ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:58 AM

కేరళం రాష్ట్రానికి చెందిన సీపీఎం ఎంపీ జాన్‌బ్రిట్టా్‌సపై బీజేపీ ఎంపీ సుష్మితాదేవ్‌ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. విపక్షాల రాద్దాంతంతో బుధవారం కొద్దిసేపు సభా..

‘లుంగీవాలా’ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

న్యూఢిల్లీ, ఆగస్టు 12: కేరళం రాష్ట్రానికి చెందిన సీపీఎం ఎంపీ జాన్‌బ్రిట్టా్‌సపై బీజేపీ ఎంపీ సుష్మితాదేవ్‌ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. విపక్షాల రాద్దాంతంతో బుధవారం కొద్దిసేపు సభా కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చింది. ‘‘నేను సభలో మాట్లాడుతున్న సమయంలో (సోమవారం).. ‘లుంగీవాలా’ అంటూ ఎంపీ సుష్మితాదేవ్‌ అవమానకరంగా వ్యాఖ్యానించారు. నేను ధరించింది ధోతి. ఒక మలయాళిగా, దక్షిణాది పారంతవాసిగా నా సంస్కృతిని చూసి గర్వపడుతున్నాను. దక్షిణాది దుస్తుల శైలి గురించి ఇలా మాట్లాడడం అవమానించడమే. ఈ తరహా వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు’’అని బ్రిట్టాస్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. సాంస్కృతిక వివక్షగా అభివర్ణిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభను మఽధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అయితే, దీనిపై రాజ్యసభ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ జోక్యం చేసుకుంటూ.. సభలో ఈ విధమైన సంస్కృతికి చోటు లేదన్నారు. తోటి సభ్యులతో అగౌరవంగా మాట్లాడడం మంచి సంప్రదాయం కాదని రాజ్యసభ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ హితవు పలికారు. సదరు ఎంపీలను తన ఛాంబర్‌కు పిలిపించి మాట్లాడతానని చెప్పడంతో సభ్యులు శాంతించారు. కాగా, ఈ ఆరోపణలను ఎంపీ సుష్మితాదేవ్‌ ఖండించారు. తాను ఏ ప్రాంతం, లేదా సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుడు కోణంలో చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 05:58 AM