తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. బస్సు డ్రైవరు మృతి, 40 మందికి గాయాలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:50 PM
తమిళనాడులోని తిండివనం సమీపంలో మంగళవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందగా, సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
తిండివనం: తమిళనాడులోని తిండివనం సమీపంలో మంగళవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందగా, సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. తిరువన్నామలై నుంచి పుదుచ్చేరి వైపు వెళ్తున్న లారీ హైవే దాటే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న బస్సును గమనించకుండా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతల్లి పల్టీలు కొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో సుమారు 40 మంది గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శక్తివేల్ అక్కడికక్కడే మరణించడంతో అతన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి తిండివనం, సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..
బెంగళూరులో దారుణం.. రక్తపు మడుగులో నగ్నంగా యువతి మృతదేహం..