Share News

బెంగళూరులో దారుణం.. రక్తపు మడుగులో నగ్నంగా యువతి మృతదేహం..

ABN , Publish Date - Apr 28 , 2026 | 03:48 PM

జార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తా(34) బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. స్థానికంగా ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. కొన్ని రోజులుగా యువతి తన ఇంటి నుంచి బయటకు రాలేదు. అయితే..

బెంగళూరులో దారుణం.. రక్తపు మడుగులో నగ్నంగా యువతి మృతదేహం..
Bengaluru Crime News

కర్ణాటక: బెంగళూరులో నగ్న స్థితిలో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రక్తపు మడుగులో మృతదేహం దొరకడం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాళం వేసిన ఇంట్లో ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే విషయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


జార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తా(34) బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. స్థానికంగా ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. కొన్ని రోజులుగా యువతి తన ఇంటి నుంచి బయటకు రాలేదు. మరోవైపు విపరీతంగా దుర్వాసన వస్తోంది. దీంతో అపార్ట్‌మెంట్ వాసులంతా అయోమయానికి గురయ్యారు. దుర్వాసన ఎక్కడ నుంచి వస్తుందా? అని బిల్డింగ్ యజమానితో పాటు వారంతా పరిశీలించారు. అనంతరం పూజా దత్తా గది నుంచే వస్తున్నట్లు గుర్తించారు. తలుపులు తీయాల్సిందిగా యువతిని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయింది.


పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గది తలుపులు పగలకొట్టగా రక్తపు మడుగులో పూజా దత్తా మృతదేహం కనిపించింది. దీంతో ఇంటి యజమాని సహా అపార్ట్‌మెంట్ వాసులంతా షాక్‌కు గురయ్యారు. అప్పటికే ఆమె మృతిచెంది దాదాపు రెండు, మూడు రోజులు అవుతోందని పోలీసులు తెలిపారు. యువతి మృతదేహం పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని వెల్లడించారు. ఆ సమయంలో గది మెుత్తం చెల్లాచెదురుగా పడివున్న చిరిగిన కాగితాలను గుర్తించారు. అయితే, అక్కడ ఎలాంటి సూసైట్ నోట్ లభించలేదన్నారు.


యువతి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హత్య కోణంలోనూ విచారణ చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, యువతి ఆత్మహత్య ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. నగ్నంగా మృతదేహం లభించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

కొడైకెనాల్‌లో సైక్లింగ్‌తో సందడి చేసిన సీఎం స్టాలిన్

Updated Date - Apr 28 , 2026 | 04:52 PM