Share News

కూడంకుళం అణు కేంద్రం డేటా చోరీ

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:03 AM

దేశంలోని అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రమైన కూడంకుళం అణువిద్యుత్‌ ప్లాంటుకు సంబంధించిన సున్నితమైన డేటా ‘డార్క్‌ వెబ్‌’లో...

కూడంకుళం అణు కేంద్రం డేటా చోరీ

చెన్నై, జూలై 15(ఆంధ్రజ్యోతి): దేశంలోని అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రమైన కూడంకుళం అణువిద్యుత్‌ ప్లాంటుకు సంబంధించిన సున్నితమైన డేటా ‘డార్క్‌ వెబ్‌’లో లీక్‌ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఇది జాతీయ భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తగా, హ్యాకింగ్‌ ద్వారానే ఆ డేటా చోరీ అయ్యిందని సంబంధిత వర్గాలు ధ్రువీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా మంది అణువిద్యుత్‌ కేంద్రాలంటే భయపడుతున్నారు. తమిళనాడులో తిరునల్వేలి జిల్లా కూడంకుళంలోని అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రస్తుతం ఆ నిరసనలు సద్దుమణిగిన తరుణంలో, తాజాగా డేటా లీక్‌ కావడం కలవరపెడుతోంది. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తొలుత ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వ్యవహారంపై భారత అణుశక్తి పరిశోధన కేంద్రంతో కలసి ఇండియాస్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌) విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 06:03 AM