Share News

సింగరేణిలో ‘కోల్‌ గ్యాసిఫికేషన్‌’ చేపట్టండి

ABN , Publish Date - May 29 , 2026 | 05:08 AM

లంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థలో కోల్‌ గ్యాసిఫికేషన్‌ (బొగ్గును రసాయ న ప్రక్రియ ద్వారా ఇంధనంగా ఉపయోగపడే సిన్‌గ్యా్‌సగా మార్చడం) ప్రాజెక్టును ప్రారంభించాలని...

సింగరేణిలో ‘కోల్‌ గ్యాసిఫికేషన్‌’ చేపట్టండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సూచన

న్యూఢిల్లీ, మే 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థలో కోల్‌ గ్యాసిఫికేషన్‌ (బొగ్గును రసాయ న ప్రక్రియ ద్వారా ఇంధనంగా ఉపయోగపడే సిన్‌గ్యా్‌సగా మార్చడం) ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌ రెడ్డి సూచించారు. గురువారం కోల్‌ గ్యాసిఫికేషన్‌పై జరిగిన రోడ్‌ షోకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధి, ఆత్మ నిర్భర్‌ భారత్‌ లక్ష్యాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని, ఇందులో కోల్‌ గ్యాసిఫికేషన్‌ కీలకమైన ముందడుగని చెప్పారు. దీనికి త్వరితగతిన అనుమతుల మంజూరు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు. 2014లో కేంద్రం రూ.8,500 కోట్లతో కోల్‌ గ్యాసిఫికేషన్‌ పథకం మొదటి దశను ప్రారంభించగా మంచి స్పందన వచ్చిందని, తక్కువ సమయంలోనే 8 ప్రాజెక్టులు ముందుకొచ్చాయని చెప్పారు. పథకం రెండో దశకు రూ.37,500 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీకి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిందన్నారు. దీని ద్వారా రూ.2.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రానున్నాయన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 05:08 AM