Share News

ఫిలిప్పీన్స్‌లో చారిత్రక గురుద్వారా పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:17 AM

ఫిలిప్పీన్స్‌లోని అత్యంత పురాతన గురుద్వారా అయిన ఖల్సా దివాన్ పునరాభివృద్ధి పనులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగం మంగళవారం ఉదయం ఖల్సా దివాన్‌ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా పునరాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శంకుస్థాపన వేడుకల్లో పాల్గొన్నారు.

ఫిలిప్పీన్స్‌లో చారిత్రక గురుద్వారా పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన
PM Narendra Modi

మనీలా, నవంబర్ 17: ఫిలిప్పీన్స్‌లోని అత్యంత పురాతన గురుద్వారా అయిన ఖల్సా దివాన్ పునరాభివృద్ధి పనులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉన్న ఈ చారిత్రక గురుద్వారా శతాబ్దానికి పైగా సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది. అయితే, మూడు రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా ఇవాళ (మంగళవారం) ఉదయం ఖల్సా దివాన్‌ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా పునరాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శంకుస్థాపన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సెనేటర్ ఫ్రాన్సిస్ జోసెఫ్ ఎస్కుడెరో, మనీలా నగర మేయర్ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనో పాల్గొన్నారు.


అనంతరం ప్రధానమంత్రి ఖల్సా దివాన్‌లో 'కార్ సేవ' (స్వచ్ఛంద సేవ) నిర్వహించారు. ఈ సందర్భంగా పురాతన గురుద్వారా ఖల్సా దివాన్‌ను సందర్శించడం, ఇక్కడ ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కాగా, గురుద్వారా ఖల్సా దివాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని 1901లో తొలిసారిగా స్థాపించారు. 1903లో వ్యవస్థీకృత సంస్థగా రూపుదిద్దుకోగా.. 1924లో ఖల్సా దివాన్ పేరుతో అధికారికంగా నమోదు చేయబడింది. ఫిలిప్పీన్స్‌లో ఏర్పాటైన తొలి గురుద్వారా ఇదే కావడంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా మనీలాలో నివసించే సిక్కులు, పంజాబీ కుటుంబాలకు తరతరాలుగా ఈ గురుద్వారా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.


ఈ గురుద్వారా కేవలం ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే స్థలం మాత్రమే కాదు. సిక్కు సంప్రదాయాలు, గురువుల బోధనలు, సేవాభావాన్ని తర్వాతి తరాలకు అందించే కేంద్రంగానూ పనిచేస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక, సేవా కార్యక్రమాల ద్వారా సిక్కు సమాజంతోపాటు ఇతర వర్గాల ప్రజలకూ ఈ సంస్థ సేవలందిస్తోంది. మనీలాలోని భారతీయ సంతతికి చెందిన ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం, వారి మతపరమైన, సాంస్కృతిక గుర్తింపును కాపాడటంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

Updated Date - Nov 17 , 2026 | 12:10 PM