Share News

యూట్యూబర్ అమృత్ సింగ్‌పై కేరళంలో కేసు.. బీజేపీ విమర్శలు..

ABN , Publish Date - Oct 25 , 2026 | 07:39 PM

ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమృత్ సింగ్ డారెన్‌‌పై కేరళం పోలీసులు కేసు నమోదు చేశారు.

యూట్యూబర్ అమృత్ సింగ్‌పై కేరళంలో కేసు.. బీజేపీ విమర్శలు..
Amrit Singh Darren

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమృత్ సింగ్ డారెన్‌ (Amrit Singh Darren)పై కేరళం పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఫోర్ట్ కొచ్చి ప్రాంతంలో ఉన్న ఓ కేఫ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కేరళం రాజకీయాల్లోనూ చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు.


ఫోర్ట్ కొచ్చిలోని కాశీ ఆర్ట్ కేఫ్ గురించి డారెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ కేఫ్‌లో మహాత్మా గాంధీ చిత్రంతోపాటు పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రాన్ని ప్రదర్శించడాన్ని ఆయన ప్రశ్నించారు. అక్కడ గొడ్డు మాంసం వడ్డిస్తున్నారని కూడా వెల్లడించారు. అంతేకాకుండా, ఆ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం తీవ్రంగా ఉందని, కొన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన వీడియోలోని వ్యాఖ్యలు మతాల మధ్య అనుమానాలు, విద్వేషాలు పెంచే ప్రమాదం ఉందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు (Kerala YouTuber FIR).


కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళంలో మత విద్వేషానికి చోటు లేదని, రాష్ట్రాన్ని ప్రతికూలంగా చిత్రీకరించి సమాజంలోని వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను అంగీకరించబోమని పేర్కొన్నారు. సదరు యూట్యూబర్‌పై కేసు నమోదైందని, చట్ట ప్రకారం చర్యలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ అంశంపై కేరళం బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ముఖ్యమంత్రి మత సామరస్యం గురించి మాట్లాడటాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే అన్ని మతాల ప్రజల మనోభావాల విషయంలో ఒకే విధమైన సున్నితత్వం ఉండాలని అన్నారు (Fort Kochi cafe controversy).


హిందువులు, దేశ అనుకూల భావాలు కలిగినవారి ఆందోళనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. మత సామరస్యం విషయంలో ఎంపిక చేసుకుని స్పందించడం సరికాదని విమర్శించారు. జిన్నాకు సంబంధించిన కళాకృతి, మతపరమైన మనోభావాలు, హమాస్‌కు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సమానంగా స్పందించాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ముంబైలో తీవ్ర వాయు కాలుష్యం.. దుమ్ము, వాహనాల పొగ, నిర్మాణ పనులే ప్రధాన కారణాలు..


మామ ఇంట్లో బంగారం కాజేసి థార్ కొన్నాడు.. పూజకు ఆ మామనే ఆహ్వానిస్తే..

Updated Date - Oct 25 , 2026 | 07:41 PM