ధ్రువీకరణ పత్రంలో‘దత్తత’ తీసేయండి
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:58 AM
దత్తత పిల్లల విషయంలో వివక్షకు పుల్‌స్టాప్ పెడుతూ.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
కన్నబిడ్డ, దత్తత బిడ్డ అన్న వ్యత్యాసం వద్దు
కేరళం సర్కారుకు ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశం
కోచి, నవంబరు 18: దత్తత పిల్లల విషయంలో వివక్షకు పుల్‌స్టాప్ పెడుతూ.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కన్నబిడ్డ అయినా, దత్తత తీసుకున్నా.. తేడా చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సమాజం కూడా వారిని కుమారులు, కుమార్తెలుగానే అంగీకరిస్తున్నప్పుడు.. అధికారిక రికార్డుల్లో ‘దత్తత కుమారుడు’, ‘దత్తత కుమార్తె’ అని ప్రత్యేకంగా పేర్కొనడాన్ని నిలిపివేయాలని జస్టిస్ పీవీ కున్షికృష్ణన్ ఆధ్వర్యంలోని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పెళ్లయి 16 ఏళ్లయినా సంతాన భాగ్యం లేకపోవడంతో ఒక జంట.. 1990 జూన్‌లో నెలరోజుల్లోపు వయసున్న పాపను(పిటిషనర్) దత్తత తీసుకుంది. అప్పటి నుంచి ఆమెను కన్నకూతురిగానే వారు పెంచారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, విద్యార్హతల సర్టిఫికెట్లలోనూ ఆమెను వారి సంతానంగానే నమోదు చేశారు. 2023లో తల్లి మరణించిన అనంతరం జారీ చేసిన వారసత్వ ధ్రువీకరణ పత్రంలో ఆమెను కుమార్తెగానే పేర్కొన్నప్పటికీ.. 2024 అక్టోబర్‌లో తండ్రి మరణానంతరం ఊహించని పరిస్థితి ఎదురైంది. త్రిసూర్ తహసీల్దార్ జారీ చేసిన వారసత్వ ధ్రువీకరణ పత్రంలో మాత్రం ఆమెను దత్తత కుమార్తె అని పేర్కొన్నారు. ఈ అదనపు పదం(దత్తత) తన గౌరవానికి భంగం కలిగిస్తోందని ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు