Share News

మేము తప్పు చేశాం.. వందేమాతరం పాడినందుకు క్షమాపణలు చెప్పిన ముస్లిం మతపెద్దలు..

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:30 PM

జమ్మూకశ్మీర్‌లో వందేమాతరం గీతం చుట్టూ వివాదం ముదురుతోంది. శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డు నిర్వహించిన కార్యక్రమంలో వందేమాతరం గీతం ఆలపించారు. ఆ సమయంలో నిలబడిన కొందరు ముస్లిం మతపెద్దలు తాజాగా క్షమాపణలు చెప్పారు.

మేము తప్పు చేశాం.. వందేమాతరం పాడినందుకు క్షమాపణలు చెప్పిన ముస్లిం మతపెద్దలు..
Vande Mataram Controversy

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో వందేమాతరం గీతం చుట్టూ వివాదం ముదురుతోంది. శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డు నిర్వహించిన కార్యక్రమంలో వందేమాతరం గీతం ఆలపించారు. ఆ సమయంలో నిలబడిన కొందరు ముస్లిం మతపెద్దలు తాజాగా క్షమాపణలు చెప్పారు. తాము చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అల్లాహ్‌ను క్షమాపణ కోరినట్లు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది (Vande Mataram Controversy).


నవంబర్ 23న శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ వ్యవసాయ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయంలో జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డు తొలిసారిగా వక్ఫ్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వక్ఫ్ బోర్డు అధ్యక్షురాలు దరఖ్షన్ ఆండ్రాబీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరు చరణాలతో కూడిన వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ఇమామ్‌లు, ముస్లిం మతపెద్దలు కూడా గౌరవ సూచకంగా నిలబడ్డారు (Kashmir Clerics Apology).


ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. వందేమాతరం పాడుతున్నప్నుడు లేచి నిల్చున్న మతపెద్దలపై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల నేపథ్యంలో సదురు మతపెద్దలు తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు. వందేమాతరం గీతం ఆలపించే సమయంలో నిలబడటంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 'మేము తప్పు చేశాం. ఈ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నాం. అల్లాహ్‌ను క్షమాపణ కోరుతున్నాం' అని వారు పేర్కొన్నారు (Muslim Clerics Kashmir).


కశ్మీర్‌కు చెందిన ముత్తహిదా మజ్లిస్-ఎ-ఉలమా (ఎంఎంయూ) కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది (J&K Waqf Board). మిర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ నేతృత్వంలోని ఈ సంస్థ వక్ఫ్ బోర్డు కార్యక్రమంలో వందేమాతరం ఆలపించడాన్ని తప్పుబట్టింది. అధికారిక కార్యక్రమం అయినంత మాత్రాన వందేమాతరం ఆలపించడం తప్పనిసరి కాదని పేర్కొంది. ముస్లింల మత విశ్వాసాలు, భావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ గీతాన్ని కార్యక్రమంలో చేర్చడం సరికాదని అభిప్రాయపడింది.


ఇవి కూడా చదవండి..

అమెరికా వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..


అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 26 , 2026 | 05:50 PM