ఫించను డబ్బుల్లో వాటా కోసం గొడవ.. నానమ్మను చంపేసిన మనవడు..
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:45 PM
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. నాన్నమ్మకు ప్రతి నెలా వచ్చే ఫించను డబ్బులో తనకు కొంత ఇవ్వాలని పట్టుబట్టిన మనవడు చివరకు ఆమెను చంపేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని గోనె సంచుల్లో కుక్కి, రాళ్లు కట్టి డ్యామ్‌లో పడేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. నాన్నమ్మకు ప్రతి నెలా వచ్చే ఫించను డబ్బులో తనకు కొంత ఇవ్వాలని పట్టుబట్టిన మనవడు చివరకు ఆమెను చంపేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని గోనె సంచుల్లో కుక్కి, రాళ్లు కట్టి డ్యామ్‌లో పడేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో కలకలం రేపింది (Karnataka Crime News).
బెలగావి జిల్లా హుక్కేరి తాలూకా అరళికట్టి గ్రామానికి చెందిన హమ్మవ్వ బాలప్ప సనాది (78)కు ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం కింద నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం అందుతోంది. ఈ డబ్బులో తనకు వాటా ఇవ్వాలని ఆమె మనవడు రామప్ప సనాది (20) కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. డబ్బు విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత కొన్నేళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. నవంబర్ 10న హమ్మవ్వ పష్చాపూర్ వారపు సంతకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరింది. ఆమెకు వెండి ఆభరణాలు కొనిస్తానని చెప్పి భీమప్ప తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు (Grandmother Murder).
ఆమెను సంతకు తీసుకెళ్లకుండా సిద్ధేశ్వర కొండ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. గృహలక్ష్మి పథకం డబ్బులో తనకు వాటా ఇవ్వాలని అక్కడ మరోసారి హమ్మవ్వను అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రామప్ప ఆమెను కిందకు తోసి, చేతులతో గొంతు నులిమి, ఆ తర్వాత తాడుతో బిగించి హత్య చేశాడు. అమె వద్ద ఉన్న డబ్బులను, గొలుసులను తీసుకున్నాడు. మృతదేహాన్ని గోనె సంచుల్లో కుక్కి, రాళ్లు కట్టి డ్యామ్‌లో పడేశాడు (Karnataka Murder Case).
నవంబర్ 10న ఇంటి నుంచి వెళ్లిన హమ్మవ్వ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. నవంబర్ 15న జినారల్ గ్రామం సమీపంలోని డ్యామ్ నీటిలో గోనె సంచుల్లో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. హమ్మవ్వ కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో చివరిసారిగా హమ్మవ్వ తన మనవడితో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో రామప్పను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌ను చూసి నేర్చుకోండి.. అమెరికా వడ్డీ రేట్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..