తమిళనాడు తరహా రిజర్వేషన్ల కోసం సుప్రీం కోర్టుకు కర్ణాటక ప్రభుత్వం
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:54 AM
తమిళనాడు తరహాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపును అమలుచేసే వెసులుబాటును కల్పించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
బెంగళూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు తరహాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపును అమలుచేసే వెసులుబాటును కల్పించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ బుధవారం మీడియాకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు రిజర్వేషన్లను పెంచుతూ, మొత్తం రిజర్వేషన్లను 56ు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు అభ్యంతరం తెలిపిందని, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆదేశించిందని చెప్పారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్-9 కింద చేర్చి రక్షణ కల్పించారని, పొరుగు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్నప్పుడు కర్ణాటకలో ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు