Share News

కర్ణాటక రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా నిషేధం

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:53 PM

కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా(Social media) వాడటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా నిషేధం
Karnataka Social Media Ban

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా(Social media) వాడటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) శుక్రవారం శాసన సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్(State budget)ను ప్రవేశపెడుతూ ఈ ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.


ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ..‘పిల్లలకు సోషల్ మీడియా ఒక వ్యసనంలా మారుతోంది. దీంతో మానసిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒంటరిగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తున్నారు, తల్లిదండ్రులతో సమయాన్ని గడప లేకపోతున్నారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది’ అని అన్నారు.


ఇవీ చదవండి:

రికార్డు స్థాయిలో 17వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సిద్ధరామయ్య

రాజ్యసభకు బిహార్‌ సీఎం నితీశ్‌ నామినేషన్‌

Updated Date - Mar 06 , 2026 | 02:25 PM