రీల్స్ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పై పడి రెండు చేతులూ కోల్పోయిన యువతి..
ABN , Publish Date - Aug 27 , 2026 | 08:54 AM
సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే సరదా ఓ 19 ఏళ్ల యువతికి జీవితాంతం మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. రైల్వే ట్రాక్ సమీపంలో స్నేహితులతో కలిసి రీల్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఆమె రెండు చేతులను కోల్పోయింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే సరదా ఓ 19 ఏళ్ల యువతికి జీవితాంతం మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. రైల్వే ట్రాక్ సమీపంలో స్నేహితులతో కలిసి రీల్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఆమె రెండు చేతులను కోల్పోయింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని గఢ్వా జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలిని పూర్ణిమ కుమారిగా గుర్తించారు (Jharkhand reel accident).
మంగళవారం పూర్ణిమ కొంతమంది స్నేహితులతో కలిసి రైసా ప్రాంతంలోని రైల్వే లైన్ వద్దకు వెళ్లింది. అక్కడ అందరూ మొబైల్ ఫోన్లలో రీల్స్ తీసుకుంటున్నారు. అదే సమయంలో రాంచీ వైపు నుంచి రాంచీ-చోపన్ ఎక్స్‌ప్రెస్ వస్తోంది. రైలు వేగం, తనకు ఉన్న దూరాన్ని పూర్ణిమ సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. రైలు ఢీకొనడంతో ఆమె రెండు చేతులు తెగిపోయాయి. శరీరంలోని ఇతర భాగాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి (Teen loses both hands).
ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు ఆమెను గఢ్వా సదర్ ఆస్పత్రికి తరలించారు (Railway track reel accident). అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి..
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..