2030 నాటికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ‘అడాప్టివ్ టెస్టింగ్’
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:15 AM
జేఈఈ అడ్వాన్స్‌డ్ అసెస్మెట్ విధానాన్ని మార్చే ఆలోచన ప్రతిపాదన దశను దాటి పైలట్ దశకు చేరుకుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని కొలిచేందుకు, కోచింగ్‌పై...
కోచింగ్ భారాన్ని తగ్గించడమే లక్ష్యం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: జేఈఈ అడ్వాన్స్‌డ్ అసెస్మెట్ విధానాన్ని మార్చే ఆలోచన ప్రతిపాదన దశను దాటి పైలట్ దశకు చేరుకుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని కొలిచేందుకు, కోచింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అడాప్టివ్ టెస్టింగ్ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. నూతన అసెస్మెంట్ విధానంలో ప్రశ్నల సంక్లిష్టత అభ్యర్థుల పెర్ఫార్మెన్స్‌కు అనుగుణంగా ఉంటుంది. తాజాగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో వివిధ ఐఐటీల్లోని 4 వేల మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల స్పందనలు, పెర్ఫార్మెన్స్‌లు సేకరించామని, ప్రస్తుతం వాటిని ప్రాసెస్ చేస్తున్నామని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద అగర్వాల్ తెలిపారు. 2030కల్లా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత అడాప్టివ్ విధానంలో విద్యార్థులకు తొలుత విభిన్న రకాల ప్రశ్నలు సంధిస్తారు. పరీక్షలో ముందుకుసాగుతున్న కొద్దీ వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగా సామర్థ్య స్థాయిలను నిర్ణయిస్తారు. వివిధ సామర్థ్య స్థాయిలలో ఆటోమేటిక్‌గా ప్రశ్నలను సంధించే అంశాన్ని కూడా ఐఐటీ కాన్పూర్ పరిశీలిస్తోంది. ఇందులో విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా తాజా ప్రశ్నలు వచ్చేలా డేటాబే్‌సను రూపొందిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..