Share News

భారత్‌ మామిడిపై జపాన్‌ నిషేధం

ABN , Publish Date - May 29 , 2026 | 05:01 AM

భారత్‌కు చెందిన మామిడిపళ్ల దిగుమతిపై జపాన్‌ మళ్లీ నిషేధం విధించింది. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. 2006లో నిషేధం తొలిగించినప్పటి నుంచి...

భారత్‌ మామిడిపై జపాన్‌ నిషేధం

న్యూఢిల్లీ, మే 28: భారత్‌కు చెందిన మామిడిపళ్ల దిగుమతిపై జపాన్‌ మళ్లీ నిషేధం విధించింది. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. 2006లో నిషేధం తొలిగించినప్పటి నుంచి మన మామిడి ఎగుమతులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్‌పూర్‌లో ఉన్న శుద్ధి కేంద్రాల పరిశీలనలో ఫ్యుమిగేషన్‌, క్రిమిసంహారక చర్యల్లో లోపాలను జపాన్‌ క్వారంటైన్‌ నిపుణులు గుర్తించారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది మన దేశం నుంచి తాజా మామిడిపండ్ల దిగుమతులు నిలిపివేశారు. ఈ నిర్ణయంతో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు జోరుగా జరిగే ఎగుమతులకు బ్రేక్‌ పడింది. అత్యధికంగా ఎగుమతయ్యే బంగినపల్లి, ఆల్ఫోన్సో, కేసర్‌, లాంగ్రా వంటి వెరైటీలపై జపాన్‌ నిషేధం ప్రభావం చూపనుంది. మార్చి 25, 2026 తర్వాత భారత్‌ జారీ చేసిన తనిఖీ ధ్రువీకరణ పత్రాలతో కూడిన దిగుమతులను జపాన్‌ ప్రభుత్వం అనుమతించబోదని యోకోహామా ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ అసోసియేషన్‌ జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్‌ అధికారులు సంతృప్తి చెందే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పండు ఈగ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 1986లో జపాన్‌ తొలిసారి మన మామిడిని నిషేధించింది. 2006లో దానిని ఎత్తివేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 05:01 AM