Share News

ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద యువతి హల్‌చల్.. బస్సును అడ్డుకుని..

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:04 AM

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అదుపులోకి తీసుకున్న ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసు బస్సుకు ఆమె అడ్డంగా నిలబడి.. బస్సును ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించింది.

ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద యువతి హల్‌చల్..  బస్సును అడ్డుకుని..
Jantar Mantar

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఓ యువతి చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదుపులోకి తీసుకున్న నిరసనకారులను తరలిస్తున్న పోలీసు బస్సుకు యువతి ఎదురుగా నిలబడి, ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. నిరసనకారులను విడుదల చేసే వరకూ బస్సును కదలనివ్వబోనన్నట్లుగా ఆమె అక్కడే నిలబడిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. ఈ ఘటనతో సోషల్ మీడియాలో ఆమెను ముంబై నిరసనల్లో పోలీసు వాహనాన్ని అడ్డుకుని వైరల్ అయిన మోడల్ రియా అహిర్‌తో పోలుస్తూ పలువురు పోస్టులు చేశారు.


సీఈసీ రాజీనామా.. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ శుక్రవారం జంతర్‌మంతర్ వద్ద నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు 500 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. వారిలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్, మాజీ ఢిల్లీ సీఎం అతిషి, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా తదితరులు ఉన్నారు. ఇదే సమయంలో బస్సును అడ్డుకున్న యువతి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె చర్యను నిరసనలో భాగంగా పేర్కొనగా, మరికొందరు దీనిని ప్రచారం కోసం చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు.


ఇవి కూడా చదవండి..

ఆసియా క్రీడలు: ఆర్చరీలో మరో గోల్డ్.. తొలి భారత మహిళగా కుంకుమ్‌ చరిత్ర

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ఏపీ ప్రభుత్వం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 12:50 PM