Share News

మీ స్నేహాన్ని మరిచిపోం..!

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:32 AM

ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడిలో మరణించిన తమ మాజీ సుప్రీం లీడర్‌ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు భారత్‌కు ఇరాన్‌ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో...

మీ స్నేహాన్ని మరిచిపోం..!

  • ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు భారతదేశానికి ఇరాన్‌ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, జూలై 6: ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడిలో మరణించిన తమ మాజీ సుప్రీం లీడర్‌ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు భారత్‌కు ఇరాన్‌ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో తమకు భారత్‌ అండగా నిలిచిందని, ఆ దేశ స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోమని పేర్కొంది. భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం సోమవారం ఈ మేరకు ఎక్స్‌లో ఒక సందేశం ఉంచింది. ‘ఈ దుఃఖ సమయంలో భారత్‌ మాకు భరోసాగా నిలిచింది. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొని రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాన్ని, పరస్పర గౌరవాన్ని ఎంతో శక్తిమంతంగా చాటింది. భారత్‌ స్నేహాన్ని మేము ఎప్పటికీ కాపాడుకుంటాం’ అని పేర్కొంది. టెహ్రాన్‌లో నిర్వహించిన ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో భారత్‌ తరఫున బెంగాల్‌ గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డ్‌) సయ్యద్‌ అటల్‌ హస్నైన్‌, కేంద్ర మంత్రి పబిత్ర మార్గరీటాతోపాటు హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ మత గురువులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్‌నేత సల్మాన్‌ ఖుర్షీద్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా పాల్గొన్నారు. ఖమేనీ భౌతికకాయాన్ని గురువారం మషాద్‌ నగరంలో ఖననం చేయనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 06:32 AM