Share News

నిరవధిక ధర్నాగా మారే అవకాశం.. సీజేపీ జెండా ప్రదర్శనపై నిఘా హెచ్చరిక..

ABN , Publish Date - Oct 16 , 2026 | 08:58 AM

దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించనున్న 'లెహ్రా దో తిరంగా' కార్యక్రమంపై నిఘా వర్గాలు అప్రమత్తమైనట్టు సమాచారం.

నిరవధిక ధర్నాగా మారే అవకాశం.. సీజేపీ జెండా ప్రదర్శనపై నిఘా హెచ్చరిక..
CJP protest

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించనున్న 'లెహ్రా దో తిరంగా' కార్యక్రమంపై నిఘా వర్గాలు అప్రమత్తమైనట్టు సమాచారం. జాతీయ జెండాతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా, నిరవధిక ధర్నాగా మారే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసన కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు (CJP Lehra Do Tiranga).


అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద జాతీయ జెండాలతో సమావేశం కావాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. జాతీయ జెండాను ప్రదర్శించడం, జాతీయ గీతాన్ని ఆలపించడం ద్వారా తమ నిరసనను తెలియజేయాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశమని పార్టీ ప్రకటించింది. అయితే, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైతే పరిస్థితులను నియంత్రించడం కష్టమవుతుందని భద్రతా విభాగాలు భావిస్తున్నట్లు సమాచారం (Connaught Place protest).


కొందరు అక్కడే ఉండిపోయి ధర్నాను కొనసాగించే అవకాశం ఉందన్నది నిఘా వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది (Intelligence warning). సీజేపీకి చెందిన సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఐదు రోజుల జుడీషియల్ కస్టడీకి పంపిన నేపథ్యంలో పార్టీ తాజా నిరసనకు పిలుపునిచ్చింది. నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌ను అక్టోబర్ 16, 17 తేదీల్లో ప్రజలకు మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్‌స్కీ ప్రయత్నాలు..


పసిడి ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 16 , 2026 | 09:02 AM