Share News

ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్‌!

ABN , Publish Date - Nov 29 , 2026 | 06:03 AM

ఎంతోమందికి ఇష్టమైన ఇన్‌స్టాగ్రామ్‌ ఇక టీవీల్లోనూ వీక్షించవచ్చు.

ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్‌!
instareels

  • యాప్‌ ద్వారా స్మార్ట్‌ టీవీల్లో చూడవచ్చు.. ప్రకటించిన మెటా

న్యూఢిల్లీ, నవంబరు 28 : ఎంతోమందికి ఇష్టమైన ఇన్‌స్టాగ్రామ్‌ ఇక టీవీల్లోనూ వీక్షించవచ్చు. అందుకు ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఫర్‌ టీవీ’ యాప్‌ను త్వరలోనే భారత్‌లోకి తీసుకురానున్నట్లు మెటా సంస్థ శుక్రవారం ప్రకటించింది. ముంబయిలో మెటా వార్షిక ‘క్రియేటర్‌ ఈవెంట్‌’ ‘హౌస్‌ ఆఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌’లో ఈ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు మొబైల్‌ ఫోన్లు, ట్యాబెట్లు, డెస్క్‌టా్‌పలలో ఇన్‌స్టాగ్రామ్‌ను చూడడానికి వీలుంది. మెటా కొద్ది రోజుల్లో తీసుకువచ్చే యాప్‌తో ఇక స్మార్ట్‌ టీవీల ద్వారా పెద్దతెరపై చూడవచ్చు. యాపిల్‌ టీవీ, అమెజాన్‌ ఫైర్‌ టీవీ, గూగుల్‌ టీవీ డివైజ్‌లకు మాత్రమే ఈ యాప్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఒక టీవీలో ఐదు ఇన్‌స్టా ఖాతాలు వాడుకోవచ్చు. ప్రాథమిక ఇన్‌స్టా ఖాతాను కనెక్ట్‌ చేసుకోవడం ఇష్టం లేనివారు... టీవీ కోసమే విడిగా కొత్తగా ఖాతాను క్రియేట్‌ చేసుకోవచ్చు. మొబైల్‌లా కాకుండా రీల్స్‌ ఆటోమెటిక్‌గా ప్లే కావడం ఇందులో మరో విశేషం. మెటా ఇప్పటికే అమెరికాలో ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది.

ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Updated Date - Nov 29 , 2026 | 06:03 AM