Share News

ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి జాతికి అంకితం

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:35 AM

రాబోయే కాలంలో ఏఐతో యుద్ధాలు చేసినా సుశిక్షితులైన సైనికుల పోరాటంతోనే విజయాలు లభిస్తాయని...

ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి జాతికి అంకితం

ఏఐ వచ్చినా సైనిక శక్తితోనే విజయాలు: రాజ్‌నాథ్‌సింగ్‌

విశాఖపట్నం, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాబోయే కాలంలో ఏఐతో యుద్ధాలు చేసినా సుశిక్షితులైన సైనికుల పోరాటంతోనే విజయాలు లభిస్తాయని, అధునాతన టెక్నాలజీని సమన్వయం చేయడం సంప్రదాయ సైనిక వ్యవస్థలతోనే సాధ్యమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ముంబైలోని మజగావ్‌ డాక్‌యార్డులో నిర్మించిన స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ‘ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి’ని విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో శనివారం ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరిని ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద 75ు స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశారు. ఇది అధునాతన కంబైన్డ్‌ డీజిల్‌ లేదా గ్యాస్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి, ఉపరితలం నుంచి గాల్లోకి బ్రహ్మోస్‌ క్షిపణులను ప్రయోగించగలదు.

ఈ వార్తలు కూడా చదవండి...

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 05:35 AM