పరిశ్రమలు పరిశోధనపై ఎక్కువ ఖర్చు చేయాలి: నీతి ఆయోగ్ సభ్యుడు
ABN , Publish Date - May 12 , 2026 | 05:55 PM
భారత పరిశ్రమలకు నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా కీలక సూచనలు చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని, పరిశ్రమలు పరిశోధన, అభివృద్ధి (R&D)పై మరింత పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
భారత పరిశ్రమలకు నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా కీలక సూచనలు చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని, పరిశ్రమలు పరిశోధన, అభివృద్ధి (R&D)పై మరింత పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే రక్షణాత్మక ధోరణిని విడిచిపెట్టాలని సూచించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు (NITI Aayog Rajiv Gauba).
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ట్రేడ్ వార్ కారణంగా సరఫరా గొలుసు వ్యవస్థల్లో భారీ మార్పులు జరుగుతున్నాయని రాజవ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత్‌లో ఆర్ అండ్ డీ ఖర్చు దేశ జీడీపీలో కేవలం 0.7 శాతం వద్దే ఉందని, ఇది ప్రపంచ సగటు (2.3 శాతం)తో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పారు. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు భారీ స్థాయిలో పరిశోధనలపై పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తుచేశారు (R&D investment India).
భారత పరిశ్రమలు విదేశీ సాంకేతికతను దిగుమతి చేసుకోవడం కాకుండా, స్వదేశీ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు (Indian economy). పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో భారత పరిశ్రమలు అంతర్జాతీయ పోటీని స్వీకరించాలని రాజీవ్ గౌబా అన్నారు. యూకే, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు కొత్త అవకాశాలను తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థుల కష్టాన్ని, కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది: రాహుల్ గాంధీ
ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..