Share News

లేని ఆస్పత్రిలో.. 87 మంది సిబ్బంది

ABN , Publish Date - Jul 07 , 2026 | 06:42 AM

అక్కడ ఆస్పత్రి కట్టడానికి కనీసం స్థలం కూడా ఖరారు కాలేదు.. ఒక్క ఇటుక కూడా పడలేదు.. కానీ కాగితాలపై మాత్రం ఆస్పత్రి ఆరేళ్లుగా పూర్తిస్థాయిలో పనిచేస్తోంది! ఈ వింత ఘటన...

లేని ఆస్పత్రిలో.. 87 మంది సిబ్బంది

  • వారికి బదిలీలు కూడా..ఇండోర్‌లో ఆరేళ్లుగా విడ్డూరం

ఇండోర్‌, జూలై 6: అక్కడ ఆస్పత్రి కట్టడానికి కనీసం స్థలం కూడా ఖరారు కాలేదు.. ఒక్క ఇటుక కూడా పడలేదు.. కానీ కాగితాలపై మాత్రం ఆస్పత్రి ఆరేళ్లుగా పూర్తిస్థాయిలో పనిచేస్తోంది! ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో వెలుగుచూసింది. ఖజ్రానా ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని 2020 జూన్‌ 23న శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రభుత్వ భూమి లేకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. అయినప్పటికీ, అధికార యంత్రాంగం ఆగకుండా ఈ ఆస్పత్రికి 87 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది. గడిచిన ఆరేళ్లుగా ఈ పోస్టులకు బదిలీలు, నియామకాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ 87 మందిలో 80 మంది సిబ్బంది నగరంలోని పీసీ సేథీ ఆస్పత్రి, హుకుమ్‌చంద్‌ ఆస్పత్రి, సంజీవని క్లినిక్‌ల వంటి ఇతర ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్నారు. భవనం లేని ఆస్పత్రికి ఏళ్లతరబడి నియామకాలు, బదిలీలు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 06:50 AM