దేశంలోనే తొలి పునర్వినియోగ రాకెట్ ఇంజన్
ABN , Publish Date - May 28 , 2026 | 06:15 AM
బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంప్‌సలోని ’అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పునర్వినియోగ(రీయూజబుల్) లిక్విడ్ రాకెట్...
క్వాలిఫికేషన్ పరీక్ష విజయవంతం
బిట్స్‌పిలానీ, హైదరాబాద్ క్యాంప్‌సలోని ‘అబ్యోమ్ స్పేస్‌టెక్’ ఘనత
బిట్స్ పిలానీ, మే 27 (ఆంధ్రజ్యోతి): బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంప్‌సలోని ’అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పునర్వినియోగ(రీయూజబుల్) లిక్విడ్ రాకెట్ ఇంజన్ క్వాలిఫికేషన్ టెస్ట్ క్యాంపెయిన్‌ను విజయవంతంగా పూర్తి చేసి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రాకెట్‌ను అబ్యోమ్ బృందమే అభివృద్ధి చేసింది. సాధారణంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్లను మరోసారి ఉపయోగించరు. కానీ ద్రవ ఇంధనంతో నడిచే పునర్వినియోగ లిక్విడ్ రాకెట్లను మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి సాంకేతికత అభివృద్ధికి అయ్యే వ్యయంతో పోలిస్తే కేవలం పదో వంతు ఖర్చుతోనే ఈ పరీక్షలు పూర్తి చేయడం విశేషం. అబ్యోమ్ సంస్థ స్వయంగా రూపొందించిన కమర్షియల్ టెస్ట్ ఫెసిలిటీ (సీటీఎ్‌ఫ)లోనే ఈ పరీక్షలు నిర్వహించారు. సంస్థ అభివృద్ధి చేస్తున్న ’ఫ్లైట్ రెడీ క్రయోజెనిక్ ఇంజిన్‘ (ఎఫ్‌ఆర్‌ఈ), ’హోప్ వీవీటీఎల్‘ రీయూజబుల్ రాకెట్ ప్రోగ్రామ్‌లకు ఈ విజయం కీలక మైలురాయిగా నిలిచింది. కాగా, తాము చేపట్టింది కేవలం ఇంజన్ పరీక్ష మాత్రమే కాదని భారత్‌లో స్వదేశీ రీయూజబుల్ ప్రొపల్షన్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి నాంది పలికామని అబ్యోమ్ స్పేస్‌టెక్ అండ్ డిఫెన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ జైనుల్ అబేదిన్ ఈ సందర్భంగాఅన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News