Share News

సౌదీలో ఇరుక్కుపోయిన మక్కా యాత్రికులు

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:22 AM

జీవితకాలంలో ఒక్కసారైనా మక్కా దర్శనానికి వెళ్లాలన్న వారి ఆశలపై విధి పగబట్టింది. హుతీ ఉగ్రదాడుల నేపథ్యంలో ఇలా సౌదీలో వేలాదిమంది భారతీయ ఉమ్రా యాత్రికులు చిక్కుకుపోయారు.

సౌదీలో ఇరుక్కుపోయిన మక్కా యాత్రికులు

  • హుతీ ఉగ్రదాడులతో ఇక్కట్లు

  • తెలుగు రాష్ర్టాలవారే అధికం.. తిండి, వసతికి ఇబ్బందులు

  • రంగంలోకి ఏపీ ప్రభుత్వం

  • బాధితులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): జీవితకాలంలో ఒక్కసారైనా మక్కా దర్శనానికి వెళ్లాలన్న వారి ఆశలపై విధి పగబట్టింది. హుతీ ఉగ్రదాడుల నేపథ్యంలో ఇలా సౌదీలో వేలాదిమంది భారతీయ ఉమ్రా యాత్రికులు చిక్కుకుపోయారు. తినడానికి తిండి, ఉండడానికి వసతి కూడా లభించక నానా ఇక్కట్లు పడుతున్నారు. వీరిలో వీరిలో క్యాన్సర్‌తో జీవనర్మణ పోరాటం చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన ముజీబ్‌ ఇమ్రాన్‌ అనే 32 ఏళ్ల యువకుడు, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బస్సామ్మా బేగం అనే వృద్ధురాలు, ఏడాదిన్నర చిన్నారి రయ్యాన్‌.. ఇలా ఎందరో ఉన్నారు. హుతీ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు భారతీయ విమాన సంస్థలు అకస్మాత్తుగా విమానాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో వీరంతా ఇబ్బందుల్లో పడ్డారు.

కొందరు అధిక మొత్తంలో డబ్బు సర్దుబాటు చేసుకుని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు. కొందరు మాత్రం పొరుగున ఉన్న బహ్రెయిన్‌ వెళ్లి అక్కడి నుంచి మాతృభూమికి చేరుకోగా, అనేకులు మాత్రం సౌదీలోనే చిక్కుకుపోయారు. ఇలా 3వేల మంది యాత్రికుల్లో తెలుగు రాష్ర్టాలకు చెందినవారే అధికంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలు, రోగులు ఉన్నారు. చివరి క్షణంలో విమానాలు రద్దు కావడంతో వీరిని మక్కాకు తీసుకెళ్లి లాడ్జిలలో ఉంచగా, వాటిని ఖాళీ చేయాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఏపీకి చెందిన సుమారు 60మందికి మక్కాలోని నిజాం రుబాత్‌ అనే ధర్మసత్రంలో వసతి కల్పించారు. కాగా, ఏపీ యాత్రికులను తిరిగి రప్పించే విషయమై అమరావతిలోని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం శుక్రవారం రంగంలో దిగింది. వివరాలను తెప్పించుకుంటూ వీలైతే ప్రత్యేక చార్టర్‌ విమానాన్ని నడిపే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 05:22 AM