ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సుల మధ్య నలిగిన కార్లు.. ఐదుగురికి గాయాలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 07:09 AM
ముంబైలోని వడాలా ప్రాంతంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తి పార్క్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలోని లోధా జంక్షన్ వద్ద రెండు బస్సులు, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఓ పెంపుడు కుక్క కూడా గాయపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని వడాలా ప్రాంతంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తి పార్క్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలోని లోధా జంక్షన్ వద్ద రెండు బస్సులు, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఓ పెంపుడు కుక్క కూడా గాయపడింది.
సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బస్సు ఆగి ఉంది. దాని వెనుక రెండు కార్లు నిలిచి ఉన్నాయి. ఇంతలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి, రెండు కార్లతో పాటు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల మధ్య కార్లు చిక్కుకుపోయాయి. ఓ కారు అయితే ముందు ఉన్న బస్సు కింద ఇరుక్కుపోయింది. కార్లలో ఉన్న ప్రయాణికులు వాహనాల్లోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించి, వాటిలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో వానీ పాల్ (65), హసన్ షేక్ (34) తలకు తీవ్ర గాయాలయ్యాయని, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు అదుపుతప్పడమే ప్రమాదానికి కారణమా? లేక సాంకేతిక లోపం ఏమైనా ఉందా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..