Share News

మృతదేహంతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురి మృతి

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:22 AM

ఝార్ఖండ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని వారాణసికి మృతదేహంతో పాటు అంత్యక్రియలకు వెళ్తున్న పికప్‌ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది.

మృతదేహంతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురి మృతి

ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని వారాణసికి మృతదేహంతో పాటు అంత్యక్రియలకు వెళ్తున్న పికప్‌ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం హజారీబాగ్‌ జిల్లాలోని దనువా లోయ సమీపంలో ఆగి ఉన్న వ్యాన్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న 19 మందిలో ఐదురుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగతా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్‌ పరారయ్యాడు.

Updated Date - Nov 10 , 2026 | 03:23 AM