జులై 1 నుంచి కొత్త రూల్స్.. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే..
ABN , Publish Date - Jun 20 , 2026 | 09:50 PM
జులై 1 నుంచి భారతీయ రైల్వే (Indian Railways) కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై విధించే కనీస జరిమానాను ప్రస్తుతం ఉన్న రూ.250 నుంచి రూ.500కు పెంచాలని నిర్ణయించింది.
జులై 1 నుంచి భారతీయ రైల్వే (Indian Railways) కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై విధించే కనీస జరిమానాను ప్రస్తుతం ఉన్న రూ.250 నుంచి రూ.500కు పెంచాలని నిర్ణయించింది. టికెట్ లేకుండా పట్టుబడిన ప్రయాణికులు ప్రయాణించిన దూరానికి సంబంధించిన చార్జీతో పాటు రూ.500 అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది (Ticketless Travel Fine).
ఇతరుల పేరుపై ఉన్న టికెట్‌తో ప్రయాణం చేయడం నేరం. ఆ ప్రయాణికుడు రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అనధికారికంగా వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడం, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలపై కూడా జరిమానాలు విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు (Railway Rules 2026).
మహిళల కోసం కేటాయించిన బోగీల్లో పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది (Train Ticket Fine). ఒక ఏడాదిలో పదే పదే రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే జైలు శిక్ష కూడా విధిస్తారు.
ఇవి కూడా చదవండి..
వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..
ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు..