Share News

పెళ్లి ప్రయాణంలో కొత్త ట్రెండ్.. రైలు కోచ్‌ని బుక్ చేసిన కుటుంబం.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:43 PM

భారతీయ వివాహాలంటే‌నే అట్టహాసాలు, హంగులు, ఆర్భాటాలు. సాధారణంగా పెళ్లి బృందం వెళ్లడానికి బస్సులు లేదా కార్లు బుక్ చేయడం చూస్తుంటాం. కానీ, ఓ కుటుంబం ఏకంగా రైల్ కోచ్‌నే బుక్ చేసింది. వివరాల్లోకి వెళితే..

పెళ్లి ప్రయాణంలో కొత్త ట్రెండ్.. రైలు కోచ్‌ని బుక్ చేసిన కుటుంబం.. వీడియో వైరల్
Viral Wedding India

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వివాహాలంటేనే అట్టహాసాలు, హంగులు, ఆర్భాటాలు. సాధారణంగా పెళ్లి బృందం వెళ్లడానికి బస్సులు లేదా కార్లు బుక్ చేయడం చూస్తుంటాం. కానీ, ఒక కుటుంబం ఏకంగా ట్రైన్‌లో ఒక పూర్తి కోచ్‌నే బుక్ చేసి, తమ పెళ్లి ప్రయాణాన్ని అత్యంత సందడిగా మార్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


వైరల్ అవుతున్న వీడియోలో.. అతిథులను ఆహ్వానిస్తూ ఒక పోస్టర్‌, కోచ్ నేమ్‌ప్లేట్‌కు దండ కట్టడం చూడవచ్చు. అలాగే, కోచ్‌ను పూలతో అలంకరించి, బంధువులందరూ పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. వధువు కేక్ కట్ చేస్తుండగా, కుటుంబమంతా ఆమె చుట్టూ చేరి కేరింతలు కొడుతూ కనిపిస్తారు. ఒక టికెట్ కలెక్టర్ బంధువులను దాటుకుంటూ తన పని తాను చేసుకుంటూ, ఆ గందరగోళంలో కూడా చిరునవ్వులతో కలిసిపోతూ కనిపిస్తాడు. బయటి వ్యక్తుల ఇబ్బంది లేకుండా, కేవలం తమ బంధు మిత్రులతోనే కలిసి ప్రయాణిస్తుండటం ఈ వీడియో ప్రత్యేకత. రైల్వే శాఖ అందించే 'ఫుల్ టారిఫ్ రేట్' (FTR) పథకం కింద వీరు ఈ సౌకర్యాన్ని పొందినట్లు తెలుస్తోంది.


ఈ వీడియోపై సోషల్ మీడియాలో రక రకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ‘అల్టిమేట్ వెడ్డింగ్ ఐడియా’ అని కామెంట్ చేస్తే, ‘టిక్కెట్లు దొరక్క అల్లాడుతుంటే, ఇలా కోచ్‌లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ఎంతవరకు సమంజసం? అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాలు తగ్గవ్‌

హస్తానికి కేరళం దక్కేనా?

Updated Date - Apr 05 , 2026 | 07:09 PM