భారత్ - అమెరికా మధ్య కుదిరిన డీల్.. వాణిజ్య సుంకాలు భారీగా తగ్గింపు..
ABN , Publish Date - Feb 07 , 2026 | 07:27 AM
భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారవడంతో సుంకాలు భారీ తగ్గనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-అమెరికా మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ముఖ్యంగా భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించడం వ్యాపార వర్గాలకు ఊరట కలిగించింది.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయడానికి అంగీకరించినట్లు అమెరికా పేర్కొంది. భవిష్యత్తులో అమెరికా నుంచి ఇంధనం, గ్యాస్‌ను పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాలని భారత్ నిర్ణయించిందని వెల్లడించింది. మొత్తం 500 బిలియన్ డాలర్ల మేర అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు భారత్ అంగీకరించినట్లు తెలిపింది. ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక రంగాల్లో అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. ఈ ఒప్పందం విజయవంతమైతే భవిష్యత్తులో పరస్పర సుంకాలను పూర్తిగా తొలగించే దిశగా అమెరికా అంగీకరించింది.
ఇక అమెరికా దిగుమతులపై భారత్ సుంకాలను సున్నా శాతానికి తగ్గించనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, వైన్ వంటి ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా రద్దు చేయనుంది. అదే సమయంలో అమెరికా జెనరిక్ మందులు, విమాన భాగాలు, రత్నాలు, వజ్రాలపై ఉన్న సుంకాలను తొలగించేందుకు అంగీకరించింది.
Also Read:
ఐదోరోజూ అదే తీరు లోక్‌సభలో సాగని కార్యకలాపాలు